21-11-2024 NORMAL NEWS 02:18 PM
swarnodayam.com
Telugu Daily News
21-11-2024 02:18 PM By Mandala Yadagiri

వే.సైదాపూర్ మొట్టమొదటి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా మండల కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు దొంత సుధాకర్ నియామకం.

వే.సైదాపూర్ మొట్టమొదటి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా మండల కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు దొంత సుధాకర్ నియామకం.
IMG_20241121_141640

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వే.సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా వే.సైదాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంత సుధాకర్ నియామకమయ్యారు. సైదాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. వే. సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా దొంత సుధాకర్, వైస్ చైర్మన్ గా న్యాదండ్ల రాజ్ కుమార్, డైరెక్టర్లుగా నెల్లి సదానందం, మహమ్మద్ చోటేమియా, పల్లె గోపాల్ రెడ్డి, బొల్లం సమ్మయ్య, పెద్ది తిరుపతి, బైరి రాజు, చల్లూరి రాజయ్య, మద్దూరి రజిత_రవీందర్ రెడ్డి, ఎర్రల శ్రీనివాస్, తాళ్లపెళ్లి వెంకటేశం, ఉడికే రాజశేఖర్ లు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జారి అయిన నియామక పత్రాన్ని హస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి, రవాణా శాఖ&బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుదవారం దొంత సుధాకర్ ని ఇతర పాలకవర్గ సభ్యుల కమిటీని నియమించినందుకు సైదాపూర్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంపిణీ చేసి, శాలువులతో పూల గుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, కొత్త మల్లారెడ్డి, సారబుడ్ల రాజిరెడ్డి, పల్లెని రవీందర్ రావు, కూతురు విధ్వాన్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, అనగోని శ్రీనివాస్, గొల్లపల్లి యాదగిరి, వెల్ది రాజు, పొన్నం రామ్ ముర్తి, పూసాల అశోక్, గుర్రం వాసుదేవ్, దాసరి కనకయ్య, నీర్ల వెంకట్రాజ్యం, పోలోజు రాజు, జంపాల చంద్రయ్య, మేకల రాజు, గాదపాక కుమార్ రాజా, గాదపాక పర్శరాములు, మోహన్ రావ్, రావుల వెంకటి, గుర్రం శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాస్, బోనగిరి అనిల్, వేముల సాయి కుమార్, గడ్డం శేఖర్, బీస వెంకటేష్, వేముల ప్రేమ్ కుమార్, మడేపు రాహుల్, తలారి రోషన్, మేదరి శ్రీరాఘన్, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!