Social 1080×1350 • Multi-page
21-11-2024 BREAKING NEWS 03:59 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ లో కోతుల బెడద సమస్యను పరిష్కరించండి మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ కు వినతి..

హుజూరాబాద్ లో కోతుల బెడద సమస్యను పరిష్కరించండి మున్సిపల్ చైర్ పర్సన్, కమిషనర్ కు వినతి..
IMG-20241121-WA0080

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్, నవంబర్ 21: హుజురాబాద్ పట్టణంలో కోతుల బెడదను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకి గురువారం వినతిపత్రం అందజేశారు. పట్టణంలో కోతుల బెడద అధికంగా ఉందని, ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. ప్రతినిత్యం కోతులు ఎవరినో ఒకరిని గాయ పరుస్తున్నాయని, వందల సంఖ్యలో కోతులు రోడ్లపై, గోడలపై ఇళ్లపై యధేచ్చగా సంచారం చేస్తూ ఉండడంతో.. మహిళలు వృద్ధులు పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు, రెవెన్యూ, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఇతర కార్యాలయాలకు వచ్చే సందర్శకులు, ఇందిరా మార్గంలోని వ్యాపారులు కోతుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుదీర్ఘకాలంగా ఈ సమస్యను ప్రజలు ఎదుర్కొంటున్నారని, మున్సిపాలిటీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కోతుల బెడదను నివారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు యూత్ నాయకులు తిప్పబత్తిని విజయ్, పళ్ళ కిషోర్ లు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!