22-11-2024 NORMAL NEWS 02:10 PM
swarnodayam.com
Telugu Daily News
22-11-2024 02:10 PM By Mandala Yadagiri

అయ్యప్ప మాలదరించి దర్గాను దర్శించిన హీరో రామ్ చరణ్ అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలి. – దీక్ష నియమాలను కించపరిచిన రామ్ చరణ్ పై హిందుత్వ వాది, బిజెపి పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు ఆగ్రహం.

అయ్యప్ప మాలదరించి దర్గాను దర్శించిన హీరో రామ్ చరణ్ అయ్యప్ప భక్తులకు క్షమాపణ చెప్పాలి. – దీక్ష నియమాలను కించపరిచిన రామ్ చరణ్ పై హిందుత్వ వాది, బిజెపి పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు ఆగ్రహం.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : రామ్ చరణ్ అయ్యప్ప మాలతో కడపలో ఉన్న దర్గాను దర్శించి హిందూ ధర్మాన్ని అవమాన పరిచాడని, వెంటనే అయ్యప్ప భక్తులకు క్షమాపణలు చెప్పాలని హిందుత్వావాది, బిజెపి పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప మాల ధరించి దర్గాను సందర్శించడంలో కుట్ర దాగి ఉందని, డబ్బులకు అమ్ముడు పోయి ఇలాంటి హేయమైన చర్యలకు హీరో రామ్ చరణ్ పాల్పడుతున్నాడని రాజు ఆరోపించారు.

దీక్షా నియమం ప్రకారం అయ్యప్పమాల వేసుకున్న ఏ స్వామి అయినా సరే వారి సొంత కుటుంబ సభ్యులు చనిపోయిన దగ్గరికి గానీ లేక వారి సమాధుల దగ్గరికి మాల ధారణతో వెళ్లడం నిషేధం, అయ్యప్పకు మోకరిల్లి మాల విరమణ చేసి వెళ్ళాలని. ఇలాంటి హిందూ సాంప్రదాయాలను కాలరాసి హిందూ ధర్మాన్ని కించ పరిచే కుట్రలు సినీ హీరోల ద్వారా జరగడం బాధాకరమన్నారు. హిందూ ధర్మం ఆచారాల ప్రకారం ఎక్కడ గుళ్లోకి గానీ ఒక పుణ్య క్షేత్రాలకు వెళ్లేపుడు ఇలాంటి బొందల దగ్గరికి పోయే సంస్కృతి లేదన్నారు. పవిత్రమైన మాలధారణ చేసి దర్గా అనే సమాధులను సందర్శించడం పెద్ద అపచారం అని చెప్పారు. దీనికి రాంచరణ్ బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాయాలని హిందూత్వ వాదిగా రాజు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇక నుండి హీరో రామ్ చరణ్ సినిమాలు ఒక్కటి కూడా హిందూ ప్రజలు చూడకుండా బహిష్కరించే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించాడు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!