23-11-2024 NORMAL NEWS 07:57 PM
swarnodayam.com
Telugu Daily News
23-11-2024 07:57 PM By Mandala Yadagiri

హుజురాబాద్ లో బిజెపి నేతల సంబరాలు.

హుజురాబాద్ లో బిజెపి నేతల సంబరాలు.
IMG-20241123-WA0079

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో NDA ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు శనివారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు మాట్లాడుతూ…. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తిరిగి ప్రచారం చేసిన అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ దొంగ హామీలు ఎవరు నమ్మలేదని కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పి బీజేపీ కి పట్టం కట్టారని అన్నారు.ఈ సంబరాల్లో జిల్లా కార్యదర్శి బింగీ కరుణాకర్, నల్ల సుమన్, కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, శశిధర్, తుమ్మల శ్రీనివాస్, రావుల వేణు, గంట సంపత్, బోరగల సారయ్య శ్రీనివాస్ ఆవుల సదయ్య కొలిపాక వెంకటేష్ రాపాక రాజు తాళ్లపల్లి దేవేంద్, హరీష్ రాజు సమ్మయ్య, రాజు బాబర్, రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!