23-11-2024 NORMAL NEWS 09:40 PM
swarnodayam.com
Telugu Daily News
23-11-2024 09:40 PM By Mandala Yadagiri

నకిలీ ధృవపత్రాలు సృష్టించి అక్రమంగా భూమిని ఆక్రమించిన ఘటనలో నలుగురు పై కేసు నమోదు..ముగ్గురు అరెస్ట్ కాగా పరారీలో ఒకరు.

నకిలీ ధృవపత్రాలు సృష్టించి అక్రమంగా భూమిని ఆక్రమించిన ఘటనలో నలుగురు పై కేసు నమోదు..ముగ్గురు అరెస్ట్ కాగా  పరారీలో ఒకరు.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ ఫతేపురకు చెందిన షేక్ అబూబకర్ 1992 సంవత్సరంలో రేకుర్తి శివారులోని సర్వే నంబర్ 79/2 లో గల 8.12 ఎకరాల భూమిని సాలెహ్ బి నుండి కొనుగోలు చేసానని, అట్టి భూమి ని 1996 లో వెంచర్ గా మార్చి పలువురికి విక్రయించానని బాధితుడు తెలిపాడు. అయితే అందులో గల ప్లాట్ నెంబర్ 311 గా గల 200 గజాల స్థలాన్ని 1996 లో గొర్ల లక్ష్మి కి , ఆమె ఆ స్థలాన్ని 2010 లో మేడి శెట్టి లచ్చయ్య కు , మేడిశెట్టి లచ్చయ్య అతని అవసరాల నిమిత్తం 2011 లో గుర్రం బాలనరేంధేర్ కు విక్రయించాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఇదిలా ఉండగా ఇట్టి ప్లాట్ నెంబర్ 311 పక్కనే గల 312, 313 ప్లాట్లు గా గల 400 గజాల స్థలం యజమాని అయిన షేక్ అబూబకర్ ఎవరికీ విక్రయించకుండా తన పేరునే వుంచుకున్నాడని తెలిపాడు. ఇట్టి 400 గజాల స్థలాన్ని కాజేయాలనే దురుద్దేశంతో తన స్థలానికి పక్క ప్లాట్ యజమాని గా వున్న గుర్రం బాలనరేందర్ (37) , గుర్రం రాజయ్య , ఉప్పు శ్రీనివాస్ , చీటీ ఉపేందర్ రావు లు పథకం ప్రకారం రేకుర్తి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేసి తప్పుడు ఇంటి నెంబర్ సృష్టించి దాని ద్వారా 2022 లో గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి గిఫ్ట్ డీడ్ ద్వారా రెజిస్ట్రషన్ చేయించుకున్నారని , తర్వాత సప్లిమెంట్ డీడ్ ద్వారా 312, 313 ప్లాట్లను రిజిస్టర్ ఆఫీస్ నందు నమోదు చేపించి 312 ప్లాట్ ను చీటీ ఉపేందర్ రావు పేరున , 313 ప్లాట్ ను ఉప్పు శ్రీనివాస్ పేరున మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అట్టి భూమి కొరకు వస్తే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అసలు యజమాని అయిన షేక్ అబూబకర్ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణలో బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న విషయాలు నిజమేనని తేలినందున నలుగురు నిందితులపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు 420, 467, 468, 471, 120-B, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

నిందితుల వివరాలు:

  1. కరీంనగర్ విద్యానగర్ , వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ 2 కి చెందిన (A1) గుర్రం బాలనరేందర్ (37),
  2. కరీంనగర్ విద్యానగర్ కి చెందిన (A3) ఉప్పు శ్రీనివాస్ (47)
  3. కరీంనగర్ మెహర్ నగర్ కి చెందిన (A4) చీటీ ఉపేందర్ రావు (38) లు అరెస్ట్ కాబడి రిమాండ్ కాగా
  4. (A2) గుర్రం రాజయ్య పరారీలో వున్నాడు.
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!