25-11-2024 NORMAL NEWS 07:22 PM
swarnodayam.com
Telugu Daily News
25-11-2024 07:22 PM By Mandala Yadagiri

కల్వరి టెంపుల్ లో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు

కల్వరి టెంపుల్ లో ఘనంగా మినీ క్రిస్మస్ వేడుకలు
IMG-20241125-WA0127(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతిసంవత్సరం మాదిరిగానే హుజురాబాద్ మండలం రంగాపూర్ కల్వరి టెంపుల్ చర్చ్ లో Rev. Dr. P.R. నెల్సన్ ఆధ్వర్యంలో కోతకాల పండుగ మరియు మినీ క్రిస్మస్ వేడుకలు ఆదివారం మద్యాహ్న నుండి రాతి) వరకు చాలా ఆడంబరంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా చిలువేరు శ్రీనివాస్ మరియు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినయ్ కుమార్ తూముల హాజరయ్యారు. సంఘసభ్యులు నూతన వస్త్రాలతో కుటుంబాల సమేతంగా హాజరై రాత్రి వరకు జరిగిన కార్యక్రమాలు అయిపోయేవరకు వీక్షించారు. చర్చిని లైట్స్ తో స్టార్స్ తో అలంకరించారు. పిల్లల నాట్యాలు, యూత్ స్కిట్స్, ప్రత్రేకమైన పాటలతో సంఘసభ్యులను, గ్రామ ప్రజలను ఆనందపరిచారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తూముల వినయ్ కుమార్ తన జీవితములో యేసుక్రీస్తు చేసిన అద్భుతములను చక్కగా వివరించారు. అది విన్న సంఘ యూత్ ఎంతో పరివర్తన చెందారు. అనంతరం అతి ప్రాముఖ్యమైన ఆధులు చిలువేరు శ్రీనివాస్ క్రైస్తవ భక్తులు క్రీస్తు చెప్పిన అనేక ప్రవచానాలను బైబిల్ నుండి బోధించారు. సత్ ప్రవర్తనతో మెదలాలని, ప్రేమ, శాంతి, దయ గుణాలను పెంపొందించుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు. ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయాలన్నారు. అనంతరం బండ చొక్కాయ్య ప్రతేకంగా చేయారు చేయించిన భారీ కేక్ ను అతిథులు చిలువేరు శ్రీనివాస్, తూముల వినయ్ కు కుమార్ మరియు చర్చి ఫాదర్ నెల్సన్ కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమం అనంతరం సంఘసభ్యులతో పాటు కులమతాలకు అతీతంగా హజరయిన అందరికీ ప్రేమవిందును ఏర్పాటు చేశారు. అందరికి బోజనంతో పాటు కేక్స్, స్వీట్స్ అందించారు. అతిథులతో పాటు. చర్చ్ కి సేవ చేస్తున్న వారికి ఫాదర్ నెల్సన్-సుధీన దంపతులు సన్మానం చేశారు. దాదాపు ఈ వేడుకలకు సంఘసభ్యులు 250 మంది హజరయినారు. ఈ వేడుకలకు వరంగల్ నుండి డిప్యూటి సూపరిండెండెంట్ ఎలిజబెత్, పోలేపాక అరుణ్ కుమార్, తూముల రాజేశ్వరి, రక్షిత, బొడ్డు సుమన్, మొగిలి, బండ దేవయ్య, అనిల్, రమేష్, విల్ సన్. విక్కి, పౌలు, కోఠి, కిరణ్ తేజ్, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, ఆశీర్వాదం, అంజనేయులు, సుజాత, శైలజ, మనీషలు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!