Social 1080×1350 • Multi-page
26-11-2024 BREAKING NEWS 03:31 PM
swarnodayam.com
Telugu Daily News

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు

అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు రామారావు
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి
రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాులర్పించారు. అనంతరం సమాఖ్య కార్యాలయంలో నిర్వహించిన రాజ్యాంగ వజ్రోత్సవ దినోత్సవ సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వాలను అందిస్తూ డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రూపొందించబడిన మన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోదించి నేడు 75 వ భారత రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రామారావు ప్రకటించారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భారత రాజ్యాంగ స్ఫూర్తి కీలకం అని ప్రపంచంలో అనేక రాజ్యాంగంలో భారత రాజ్యాంగం గొప్పదని అటువంటి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి అభినందనలు తెలుపుతూ ఘనంగా నివాళులు అర్పించారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!