27-11-2024 NORMAL NEWS 06:31 PM
swarnodayam.com
Telugu Daily News
27-11-2024 06:31 PM By Mandala Yadagiri

ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలకు కృషి..- ప్రైవేటు ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీకి కృషి చేస్తా.. – గజ్వెల్ పట్టణంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి

ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలకు కృషి..- ప్రైవేటు ఉద్యోగులకు హెల్త్ కార్డుల జారీకి కృషి చేస్తా.. – గజ్వెల్ పట్టణంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
IMG_20241127_182821

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (గజ్వెల్): రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం నుండి రావలసిన ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలకై కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో పలువురు ఉపాధ్యాయులను, పట్టభద్రులను కలిసి రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, నిరుద్యోగ ప్రైవేటు యాజమాన్యాల సమస్యలు సమస్య లు తెలిసిన వ్యక్తిగా విద్యా రంగ సంస్థల నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని తనను ఆశీర్వదించి మండలికి పంపిస్తే ఉద్యోగ నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్య సేవలతో పాటు మినిమం బేసిక్ శాలరీ అమలకు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఐటిఐ మొదటి సంవత్సరం పూర్తిచేయనుకున్న విద్యార్థులను నేరుగా రెండవ సంవత్సరంలోకి పోలిటెక్నీక్ లో అనుమతివ్వాలనే డిమాండ్ ఉందని, ఐటిఐ విద్యార్థులకు (CBT) కంప్యూటర్ బేస్ డ్ టెస్ట్ బదులు (PPT ) పెన్ పేపర్ టెస్ట్ కు అనుమర్తించాలని డిమాండ్ ఉంది వారి సమస్యలు పరిష్కరించుకోడానికి కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావలసిన సకాలంలో పెంచేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. పట్టభద్రులకు మోసటగా నిలవాలని సంకల్పంతో రానున్న పొట్టపతులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణ విద్యారంగంలో క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తూ తెలంగాణ విద్యా రంగాన్ని అగ్రగముగా నిలిపానని, ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంతోపాటు తన సంస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర కార్పొరేట్ కళాశాలలకు దీటు IIT లో అద్భుత ఫలితాలు సాధించాలని గుర్తు చేశారు. కొన్ని లక్షల మంది విద్యార్థులను ఇంజనీర్లుగా డాక్టర్లుగా తీర్చిదిద్దామని..ఉద్యోగ నిరుద్యోగ పట్టబద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న విద్యావంతుడైన తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ కోరారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే వచ్చే ప్రభుత్వ వేతనాన్ని నిరుపేద విద్యార్థులు, ఉద్యోగుల అవసరాల కోసం ఒక నిధి ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి విచ్చిస్తానని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో లైబ్రరీలు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య నిర్మూలనకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. 317 జీవో ద్వారా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి వారి స్థానికతను బట్టి సొంత జిల్లాలకు బదిలీ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!