27-11-2024 NORMAL NEWS 08:54 PM
swarnodayam.com
Telugu Daily News
27-11-2024 08:54 PM By Mandala Yadagiri

బాలికల గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు

బాలికల గురుకుల పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు
IMG-20241127-WA0181(1)


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంపులో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం మండల్ లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు నల్సా చైల్డ్ ఫ్రెండ్లి లీగల్ సర్వీస్ ఫర్ చిల్డ్రన్స్ స్కీం, బాల వివాహ ముక్తూ భారత్ తదితర బాలికల సంబంధించిన చట్టాలపై సమగ్రంగా వివరించారు. మహిళలు ఏలాంటి అన్యాయం జరిగినా, దాడులు జరిగిన నిర్భయంగా కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని న్యాయమూర్తులు సూచించారు. నిరుపేదల కోసం ప్రభుత్వమే న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. ప్రతి బాలిక చట్టాల పట్ల కనీస అవగాహన కలిగి ఉండేలా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ పి అలేఖ్య, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కుమారి పద్మ సాయి శ్రీ మరియు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ స్వాతి మరియు స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!