Social 1080×1350 • Multi-page
28-11-2024 BREAKING NEWS 07:18 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా జరిగిన జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతి

ఘనంగా జరిగిన జ్యోతిరావు పూలే 134 వ వర్ధంతి
IMG-20241128-WA0115

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారత సామాజిక విప్లవ మూర్తి మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి కార్యక్రమం హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా జ్యోతిరావు పూలే చౌరస్తాలో పూలే జయంతోత్సవ కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. .ముందుగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రలో జన్మించారన్నారు. ఆనాటి బ్రాహ్మణాధిక్యత, కుల వివక్ష ,అంటరానితనం, బాలికలకు, స్త్రీలకు చదువు లేకపోవడం వంటి సామాజిక రుగ్మతలకు కలత చెంది థామస్ ఫైన్ వ్రాసిన ది రైట్స్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంధాన్ని చదివి ప్రభావితుడై సమాజంలో ఉన్న సామాజిక దురాచారాలను నిర్మూలించడానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. సత్య శోధక్ సమాజీ సంస్థను స్థాపించి తన సొంత ఖర్చులతో బాలికలకు పాఠశాలలు, వృద్ధులకు వితంతువులకు ఆశ్రమాలు కల్పించి స్త్రీ జనోద్దారకుడుగా కీర్తిగడించారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించటమే ఆయనకు నిజంగా అర్పించి నివాళులు అవుతుందని గంధే రాధిక ప్రబోదించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమల్ గౌడ్, అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ మహమ్మద్ ఖాలిక్ హుస్సేన్, బాబు జగజీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి సదానందం, కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, పట్టణ మహిళ అధ్యక్షురాలు వేముల పుష్పలత, సొల్లు సునీత, చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, తులసి లక్ష్మణమూర్తి, కొలిపాక సమ్మయ్య, వేల్పుల ప్రభాకర్, ఎస్కే జలీల్, మోరే తిరుపతి, రియాజ్ తోపాటు అన్ని ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!