28-11-2024 NORMAL NEWS 07:52 PM
swarnodayam.com
Telugu Daily News
28-11-2024 07:52 PM By Mandala Yadagiri

జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి(DIEO )హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శన

జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి(DIEO )హుజురాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సందర్శన
IMG_20241128_194919

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి జి జగన్మోహన్ రెడ్డి గురువారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, ప్రతీ తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలకు సంభందించిన సూచనలు చేసి టాపర్స్ కు ప్రోత్సాహక బహుమతులు అందజేసి ,అభినందించారు. కళాశాలలోని ఫిషరీస్ విద్యార్థులు తయారు చేసిన అక్వేరియంను DIEO ప్రారంభించారు. విద్యా సంవత్సరం విజయవంతంకు అధ్యాపకులతో చర్చించి తగు మార్గదర్శకాలు చేశారు. వృత్తి విద్యా విద్యార్థులకు సంభందించిన ఆన్ జాబ్ ట్రైనింగ్ (OJT) క్షేత్రస్థాయి పరిశీలన చేసి వారికి ట్రైనింగ్ చేయడం వల్ల మీకు మంచి భవిష్యత్ ఉంటుంది అని సూచించారు. ఈ కార్యక్రమంలో DIEO వెంట కళాశాల ప్రిన్సిపాల్ వి ఆంజనేయరావు, కళాశాల అధ్యాపకులు మరియు కార్యాల సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!