Social 1080×1350 • Multi-page
29-11-2024 BREAKING NEWS 06:12 PM
swarnodayam.com
Telugu Daily News

దీక్షా దివస్‌లో హోరెత్తించిన హుజురాబాద్ గులాబీ సైన్యం.. కరీంనగర్ అలుగునూరులో ప్రత్యేక ఆకర్షణ హుజురాబాద్ గులాబీ దండు

దీక్షా దివస్‌లో  హోరెత్తించిన హుజురాబాద్ గులాబీ సైన్యం.. కరీంనగర్ అలుగునూరులో ప్రత్యేక ఆకర్షణ హుజురాబాద్ గులాబీ దండు
IMG_20241129_180632

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, నవంబర్ 29: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన కేటీఆర్ నేతృత్వంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గం గులాబీ సైన్యం తమ అఖండ శక్తిని ప్రదర్శించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు పింక్ జెండాలతో కరీంనగర్ అలుగునూరు వరకు ర్యాలీగా కదలివచ్చారు. వాహన ర్యాలీలు, గులాబీ జెండాలతో నిండిన వీధులు, జై బీఆర్‌ఎస్ జై కేసీఆర్ నినాదాలు, నృత్యాలతో కళకళలాడిన ఈ కార్యక్రమంలో, కేటీఆర్ హుజురాబాద్ గులాబీ దండు గురించి ప్రస్తావించినప్పుడు కార్యకర్తల్లో సందడి మరింతగా పెరిగింది. “కౌశిక్ అన్న సైన్యం” అని పలువురు ప్రశంసిస్తూ, ఆయన నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గం మరింత బలంగా బీఆర్‌ఎస్ కు కట్టుబడిందని పేర్కొన్నారు.

హుజురాబాద్ యువతలో జోష్
సమయానుకూలంగా ప్రభుత్వం పట్ల పోరాటం చేస్తూ, ప్రజల కష్టాలను ప్రభుత్వానికి చేరవేస్తూ, హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి కౌశిక్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. యువతలో ఉత్సాహం నింపుతూ పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న ఆయనను తెలంగాణ నాయకత్వంలో భవిష్యత్ అగ్రనేతగా చూస్తున్నామని సీనియర్ నాయకులు తెలిపారు.

కాంగ్రెసుపై వ్యతిరేకత
కరీంనగర్‌లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత హుజురాబాద్ నియోజకవర్గం నుంచి స్పష్టంగా కనిపించిందని పలువురు విశ్లేషించారు. “ఇక హుజురాబాద్‌లో కాంగ్రెస్‌కు స్థానం లేదని చెప్పడంలో ఆశ్చర్యం లేదు” అని సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు.

హుజురాబాద్ గులాబీ దండు ప్రత్యేక ఆకర్షణగా
అనేక ప్రాంతాల నుంచి వచ్చిన గులాబీ కార్యకర్తల్లో హుజురాబాద్ నుంచి వచ్చిన వారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీక్షా దివస్ కార్యక్రమం ద్వారా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసారు

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!