29-11-2024 NORMAL NEWS 08:28 PM
swarnodayam.com
Telugu Daily News
29-11-2024 08:28 PM By Mandala Yadagiri

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం.. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం.. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి..ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
IMG_20241129_202333

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: క్రీడలతో యువతకి శారీరక దృఢత్వం పెంపొందడంతో పాటు క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, సీనియర్ హాకీ క్రీడాకారులు కేఆర్ నాగరాజు అన్నారు. శుక్రవారం సాయంత్రం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి 68వ ఎస్ జిఎఫ్ఐ అండర్ 14 సంవత్సరాల బాల బాలికలకు హాకీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ఉమ్మడి పది జిల్లాల బాల బాలికల 20 జట్లు హాజరయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి క్రీడలకు చాలా ప్రోత్సహిస్తుందన్నారు. గతంలో ఇదే గ్రౌండ్ లో నా చిన్నతనం నా కెప్టెన్ లో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ హాకీ లో విజయం సాధించిడం జరిగిందన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించిన నిఖిత్ జరీనా, మహమ్మద్ సిరాజ్, జీవాంజి దీప్తికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇంటి స్థలంతో పాటు నజరానా ఇస్తుందన్నారు మీరు కూడా మంచిగా ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయి మరియు ఇండియా టీంకు సెలెక్ట్ అయితే మీరు కూడా అంతటి స్థాయి వస్తుందన్నారు.

నేను క్రీడాకారునిగానే 1989లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా మొదలై అంచలంచలుగా వివిధ హోదాలలో పనిచేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసి రిటైర్డ్ ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానన్నారు. నేను డాక్టర్ని ఐదామని వెళ్తే మా గురువు ఫిజికల్ డైరెక్టర్ కొమురెల్లి నా స్టైల్ చూసి నన్ను హాకీ క్రీడాకారునిగా అంతర్జాతీయ వెళ్ళే విధంగా కృషి చేశారన్నారు. మీరు కూడా నాలాగా అంచలంచెలుగా ఎదిగి ఉన్నతస్థాయికి ఎదగాలని పిల్లలకు సూచించారు. భవిష్యత్తులో పోలీసు ఉద్యోగాలను, ఇతర రంగాల ఉద్యోగాలను సాధించుకోవడం సులువుతుందన్నారు. ఉదయం నుండి పాఠశాల మైదానంలో బాల బాలికలకు వేరువేరు కోర్టులో క్రీడలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులకు బాలికల పాఠశాల, ఉన్నత పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు, కోచులకు భోజన సౌకర్యం కల్పించారు. అలాగే ప్రముఖ సామజిక వేత్త, Genpact వైస్ ప్రెసిడెంట్ “సబ్బని వెంకట్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ఒక మ్యాచ్ ను ప్రారంభించారు. అంతే కాకుండా టోర్నమెంట్ నిర్వహణకు 25,000/- ( ఇరవై ఐదు వేల రూపాయల) ఆర్ధిక సహాయం చేసారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సబ్బని వెంకట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గం దే రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ హాకీ క్లబ్ జిల్లా కార్యదర్శి బండ శ్రీనివాస్, సీఐ తిరుమల్ గౌడ్, హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, ఎంఈఓ బి శ్రీనివాస్, సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్ రావు, జయన్న ఫౌండేషన్ నిర్వాహకుడు జి జైపాల్ రెడ్డి, నాగార్జున సీడ్స్ అధినేత పుల్లూరి ప్రభాకర్ రావు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ , ఎస్జీఎఫ్ కార్యదర్శి సొల్లు సారయ్య, క్రీడల కన్వీనర్ ఏముల రవికుమార్, స్థానిక కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!