30-11-2024 NORMAL NEWS 04:56 PM
swarnodayam.com
Telugu Daily News
30-11-2024 04:56 PM By Mandala Yadagiri

రైతు పండుగను వీక్షించిన కాంగ్రెస్ నేతలు, రైతులు

రైతు పండుగను వీక్షించిన కాంగ్రెస్ నేతలు, రైతులు
IMG-20241130-WA0096(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “రైతుల పండుగ” కార్యక్రమాన్ని “తెలంగాణ ప్రభుత్వం రైతు-నేస్తం” వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హుజురాబాద్ రైతు వేదికలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు రైతులు తిలకించారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అమలు చేస్తున్న సంక్షేపతకాలను సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వివరించగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు ఆసక్తిగా విని మననం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొల్లూరి కిరణ్ కుమార్, లంకదాసరి లావణ్య, మేకల తిరుపతి, యేముల పుష్పలత, సందమల్ల బాబు, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ మిడిదొడ్డి రాజు, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బండారి సదానందం, తునికి రవి, పెరుమాండ్ల భిక్షపతి, దుబాసి బాబు, సమ్మెట సంపత్, యండి చాంద్ పాషా, లొకిని రాజుతో పాటు అగ్రికల్చర్ ఏడిఏ సునీత, ఆఫీసర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడూరు స్వామిరెడ్డి, గంటా కిరణ్ రెడ్డి, పుల్ల రాధ, కడారి తిరుమల, సొల్లు సునిత, బుర్ర రేణుకా, నర్సింగ్, ఏనుగు తిరుపతిరెడ్డి, ఉడుత ప్రణయ్, మేకల రాజ్ కుమార్, చిదురాల సునిత తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!