Social 1080×1350 • Multi-page
30-11-2024 BREAKING NEWS 07:17 PM
swarnodayam.com
Telugu Daily News

2న జయన్న పౌండేషన్ ఆధ్వర్యంలో కాట్రపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

2న జయన్న పౌండేషన్ ఆధ్వర్యంలో కాట్రపల్లిలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకు నేత్ర సమస్యలను తొలగించాలని ఉద్దేశంతో ఈనెల రెండవ తేదీ సోమవారం రోజున హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరంను ఏర్పాటు చేసినట్లు సింగపూర్ కు చెందిన జయన్న ఫౌండేషన్ అధినేత గుడిపాటి జైపాల్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కాట్రపల్లి గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన వారు సైతం ఉచిత నేత్ర వైద్య శిబిరంలో ఉచిత చికిత్సలు చేయించుకోవచ్చని హైదరాబాదులోని శంకర కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. పరీక్షల అనంతరం కంటి సంబంధించి అవసరమైన వారికి హైదరాబాదులో శస్త్ర చికిత్సలు ఉచితంగా జరిపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని కాట్రపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జైపాల్ రెడ్డి సూచించారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!