Social 1080×1350 • Multi-page
01-12-2024 BREAKING NEWS 07:45 PM
swarnodayam.com
Telugu Daily News

నేత్రదానం మహాదానం..అమ్మ చూపు సజీవం…

నేత్రదానం మహాదానం..అమ్మ చూపు సజీవం…
IMG_20241201_194320

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, డిసెంబర్ 1: ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించిన నేత్రదాత వివరాల్లోకి వెళితే వెల్ది సుభద్ర (90) కరీంనగర్ జిల్లా లోని ఎల్ఎండి కాలనీలో ఉంటున్న ఆమే శనివారం సాయంత్రం మృతి చెందారు. వారికి సదాశయ ఫౌండేషన్ ఎనిమిదవ కాలనీ పట్టణ అధ్యక్షులు వెల్ది అనంతరాములు, పెద్దపెల్లి జిల్లా మహిళా అధ్యక్షురాలు వెల్ది కవిత లు అవగాహన కల్పించగా వారి కుటుంబ సభ్యులు కొడుకులు కోడళ్ళు వెల్ది ఆంజనేయులు, నిర్మల అనంతరాములు, పద్మలత ,రాజు శారద కూతుళ్లు, అల్లుళ్లు అనంతలక్ష్మి, సిరిపురం వీరయ్య. వేదశ్రీ, నల్ల దామోదర్ లు నేత్రదానం చేశారు. అమ్మ నేత్రాలు టెక్నీషియన్ సతీష్ సేకరించి హైదరాబాదులోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కు పంపించడం జరిగింది. అంత బాధలో కూడా సమాజ హితం కోరుకొని ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించిన కుటుంబ సభ్యులను, సదాశయ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, సలహాదారు నూక రమేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!