Social 1080×1350 • Multi-page
01-12-2024 BREAKING NEWS 09:53 PM
swarnodayam.com
Telugu Daily News

మాలలకు ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న రేవంత్ రెడ్డి.. వర్గీకరణ అమలు కోసం పోరాటమే మార్గం..

మాలలకు ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న రేవంత్ రెడ్డి.. వర్గీకరణ అమలు కోసం పోరాటమే మార్గం..
IMG_20241201_214834

—ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దేశంలోనే తెలంగాణను తొలి రాష్ట్రంగా నిలబెడుతామని అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మాటను వంద రోజులు గడిచినా నిలబెట్టుకోలేదని MSP రాష్ట్ర కోర్దినేటర్ ఇంజం వెంకటస్వామిమాదిగ అన్నారు.

జమ్మికుంట మండల MRPS మరియు అనుబంధ సంఘాల సమీక్ష సమావేశం మండల ఇంచార్జి MSP జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ మాదిగ అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న ఇంజం వెంకటస్వామిమాదిగ, రుద్రరాపు రామచందర్ మాదిగ,
బెజ్జంకి అనిల్ మాదిగలు మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల ఒత్తిడికి తలొగ్గి ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకురావడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు. కొంత మంది మాల ఎంఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ విధానాన్ని , రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను , చేవెళ్ళ డిక్లరేషన్ ను ధిక్కరించి మాట్లాడుతున్న వారిని కాంగ్రెస్ పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కేఆర్ నాగరాజులు పెడుతున్న సభల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొత్బలం ఉందని అన్నారు. మాలల మాట విని ఎస్సీ వర్గీకరణ లేకుండానే టిచర్ ఉద్యోగాలు భర్తీ చేసి రేవంత్ రెడ్డి మాదిగ జాతికి ద్రోహం చేశాడని అన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటకే కట్టుబడి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగ ప్రజల్లో విశ్వాసం కోల్పోయడని అన్నారు. ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.అలాగే ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మరో పోరాటానికి మాదిగ ప్రజలు సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంజం వెంకటస్వామిమాదిగ
MRPS రాష్ట్ర కోర్దినేటర్c6 .. అని మంత్రి
రుద్రరపు రామచందర్ మాదిగ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి,
బెజ్జంకి అనిల్ మాదిగ MRPS జిల్లా అధ్యక్షులు,
తునికి వసంత్ మాదిగ MSP జిల్లా అధ్యక్షులు,
మారపెల్లి శ్రీనివాస్ మాదిగ, MSP రాష్ట్ర నాయకులు ,
రెనుకుంట్ల సాగర్ మాదిగ MSP జిల్లా నాయకులు ,
ఎర్ర ఆదిత్య మాదిగ MRPS జిల్లా ఉపాధ్యక్షులు,
అంబల రాజు మాదిగ MRPS జిల్లా కార్యదర్శి, రెనుకుంట్ల స్వర్ణ కుమార్ మాదిగ MRPS మండల కన్వీనర్.,
సమ్మన్న మాదిగ, అనిల్ మాదిగ, గణపతి మాదిగ
తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!