Social 1080×1350 • Multi-page
01-12-2024 BREAKING NEWS 11:12 PM
swarnodayam.com
Telugu Daily News

అలరించిన ఉషోదయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

అలరించిన ఉషోదయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పదవ తరగతి చదివి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఓకే చోటికి చేరుకున్న పూర్వ విద్యార్థులు సమ్మేళనం పలువురిని ఆకట్టుకుంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఉషోదయ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేసుకొని పూర్వపు వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు నాటి తీపి గుర్తులను ఒకరికొకరు గుర్తు చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉషోదయ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల వీరస్వామి-సరళ, ఉపాధ్యాయులు వి గోపాల్, మొగులయ్య, సదానందం, శ్రీనివాస్, సత్యనారాయణ, రమేష్ బాబు, కుమారస్వామిలతో పాటు విద్యార్థులు లిలిన్ చేంద్, ప్రకాష్ రెడ్డి, కమలాకర్, సతీష్, షరీఫ్, కిరణ్, ప్రసాద్, రాజు, శ్రీను, కుమారస్వామి, శ్రీలత, వనిత, స్వరూప, అరుణ, సునీత, మాధవి, నాగలక్ష్మీ మొదలగువారు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!