Social 1080×1350 • Multi-page
02-12-2024 BREAKING NEWS 05:17 PM
swarnodayam.com
Telugu Daily News

కాట్రపల్లిలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుకు విశేష స్పందన

కాట్రపల్లిలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపుకు విశేష స్పందన
IMG_20241202_171434

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో జయన్న ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు వైద్య శిబిరం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి చుట్టుపక్కల 6 గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. 400 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కంటి ఆపరేషన్ అవసరం ఉన్నవారికి 40 మందిని హైదరాబాదులోని శంకర్ కంటి ఆసుపత్రి మరియు జిల్లా అందత్వ నివారణ సంస్థకు కంటి ఆపరేషన్ కోరకు పంపించారు. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు గాను గుడిపాటి సరిత- జైపాల్ రెడ్డికి కాట్రపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ కాసగోని నిరోషా కిరణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇటి కార్యక్రమంలో తాజా మాజీ గ్రామ సర్పంచ్ కాసగోని నిరోషా కిరణ్మ, మరియు ఎంపీటీసీ రావుల అనిత వెంకట్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!