Social 1080×1350 • Multi-page
02-12-2024 BREAKING NEWS 05:35 PM
swarnodayam.com
Telugu Daily News

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలముందు ఇచ్చిన హామీలు మరచి 6 అబద్ధాలు 66 మోసాలు చేసింది… బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు రాజు

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలముందు ఇచ్చిన హామీలు మరచి 6 అబద్ధాలు 66 మోసాలు చేసింది… బిజెపి హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు రాజు
IMG_20241202_173343

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 420 దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్న ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తీవ్రంగా మోసం చేయడం జరిగిందని బిజెపి హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు సోమవారం హుజురాబాద్ నియోజకవర్గం వ్యాప్తంగా కమలాపూర్ నుండి హుజురాబాద్ టౌన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలముందు ఇచ్చిన హామీలు మరచి 6 అబద్ధాలు 66 మోసాలు చేసిందన్నారు. బైక్ ర్యాలీ బహిరంగ సభలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం కోసం బిజెపి కార్యకర్తలు పనిచేయాలని గంగిశెట్టి రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ కన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్, స్టేట్ కౌన్సిల్ మెంబెర్ పుప్పాల రఘు, జిల్లా కార్యదర్శి నరసింహరాజు, మండల అధ్యక్షులు గంగిశెట్టి రాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి తూర్పాటి రాజు, కౌన్సిలర్లు వెంకట్ రెడ్డి, నల్ల సుమన్, కమలాపూర్ అధ్యక్షలు అశోక్రెడ్డి, వీణవంక అధ్యక్షులు ఆదిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ అశోక్, సీనియర్ నాయకులు నరాల రాజశేఖర్, హుజూరాబాద్ పట్టణ కమిటీ, బూత్ అధ్యక్షులు జిల్లా పదాధికారులు, పార్టీ ముఖ్య భాద్యతలున్న నాయకులు పాల్గొనటం జరిగింది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!