Social 1080×1350 • Multi-page
02-12-2024 BREAKING NEWS 11:10 PM
swarnodayam.com
Telugu Daily News

బదిలీపై వెళ్లిన పోలీసులకు ఘనంగా వీడ్కోలు.. నూతన పోలీసులకు ఘన స్వాగతం.

బదిలీపై వెళ్లిన పోలీసులకు ఘనంగా వీడ్కోలు.. నూతన పోలీసులకు ఘన స్వాగతం.
IMG_20241202_230858

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఏసిపి హుజురాబాద్ శ్రీనివాస్ జి ఆధ్వర్యంలో పట్టణంలోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి నూతనంగా విధుల్లో చేరిన పోలీస్ కానిస్టేబుల్ ఆఫీసర్లందరీకి ఆహ్వానం మరియు అవగాహన కార్యక్రమము మరియు గత కొద్ది రోజులుగా హుజురాబాద్ సబ్ డివిజన్లో పనిచేసి బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్లన్దరికి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంను రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి హుజురాబాద్ శ్రీనివాస్ జి వారికి సబ్ డివిజన్ పరిధిలోని విధులను మరియు బాధ్యతలు పై అవగాహన కల్పించారు. అదేవిధంగా బదిలీపై వెళ్తున్న వారందరికీ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ లు అందరూ హాజరై పోలీస్ ల సేవలను ప్రజలకు మరింత మెరుగుగా అందివ్వాలననే ఉద్దేశంతో నూతనంగా విధుల్లో చేరిన ఆఫీసర్ల అందరికీ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ టౌన్, రూరల్ సిఐలు తిరుమల్ గౌడ్, పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట టౌన్, రూరల్ సీఐలు వి రవి, కిషోర్, ఎస్సైలు తోట తిరుపతి, ఎన్ రాజకుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!