03-12-2024 NORMAL NEWS 08:13 PM
swarnodayam.com
Telugu Daily News
03-12-2024 08:13 PM By Mandala Yadagiri

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో మాంటిస్సోరి విద్యార్థి ప్రతిభ

రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో మాంటిస్సోరి విద్యార్థి ప్రతిభ
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదిన వేడుకల్లో భాగంగా పాఠశాల స్థాయి మరియు కళాశాల స్థాయి విద్యార్థిని విద్యార్థులకు మానవతా విలువలు పెంపొందించుటకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరుచుటకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో ఒక లక్ష పదివేల మంది విద్యార్థులు పాల్గొనగా ఈ పోటీలో రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమితికి చెందిన మాంటిస్సోరి పాఠశాల విద్యార్థిని ఖదీజా జర్ఫీన్ అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానాన్ని పొందినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ రాష్ట్రస్థాయిలో బహుమతి అందుకున్న విద్యార్థి ఖదీజా జర్ఫీన్ కు మంచి భవిష్యత్తు ఉండాలని శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు లింగమూర్తి, యువజన సమన్వయకర్త అకినపల్లీ శ్రవణ్, సమితి కన్వీనర్ అంబరీష్, పాఠశాల ప్రిన్సిపల్ గీతాశాజు, ,విక్రమ్, జితేందర్, నమశ్శివాయ, వెంకటేశ్వర్లు, విద్యాసాగర్, చంద్రగుప్త తదితరులు అభినందించారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!