Social 1080×1350 • Multi-page
03-12-2024 BREAKING NEWS 11:18 PM
swarnodayam.com
Telugu Daily News

జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి..పోలీసు కమీషనర్ తో పాటు జమ్మికుంట పోలీసు స్టేషన్ తనిఖీలో పాల్గొన్న ట్రైనీ ఐ.పి.ఎస్. వసుంధర యాదవ్.

జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి..పోలీసు కమీషనర్ తో పాటు జమ్మికుంట పోలీసు స్టేషన్ తనిఖీలో పాల్గొన్న ట్రైనీ ఐ.పి.ఎస్. వసుంధర యాదవ్.
IMG-20241203-WA0351

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఆకస్మిక తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ లో హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. వారికి కేటాయించబడిన విధులు అడిగి తెలుసుకున్నారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సిసిటిఎన్ఎస్ లో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకున్నారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల వారీగా పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నీ గ్రామాలకు పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు.

నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేసారు. పోలీసు స్టేషన్ లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలుగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు.

రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి రవి, ఎస్సై ఆరోగ్యం ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!