Social 1080×1350 • Multi-page
04-12-2024 BREAKING NEWS 03:24 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రణవ్ ఆధ్వర్యంలో పెద్దపల్లికి భారీగా తరలిన హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు..

ప్రణవ్ ఆధ్వర్యంలో పెద్దపల్లికి భారీగా తరలిన హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు..
IMG-20241204-WA0057(1)

–పెద్దపల్లిలో కాంగ్రెస్ యువ వికాస సభకు తరలివెళ్ళిన యువత, రైతులు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం నుండి పెద్దపల్లిలో నేడు జరగనున్న కాంగ్రెస్ యువ వికాస(సీఎం) సభకు కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితేల ప్రణవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు తెలుపుతూ, నిరుద్యోగులు, రైతుల గురించి ఆలోచించి అటు నిరుద్యోగులకు భరోసా ఉద్యోగ నియామక పత్రాలు ఆందజేస్తూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితేల ప్రణవ్ అన్నారు. బుధవారం పెద్దపల్లిలో జరిగిన యువ వికాస సభకు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సభకు పెద్దఎత్తున హుజురాబాద్ నుండి యువత, రైతులు, కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు. ఈ సభతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ పెరిగింది. నిరుద్యోగులకు యాభై ఐదు వేల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు రుణమాఫీ, బోనస్ ఇస్తూ మరింత బాధ్యతగా ముందుకు వెళ్తామనీ ఈ సభ ద్వారా స్పష్టమైందని తెలిపారు. రానున్న నాలుగేళ్లలో మరింత బాధ్యతగా పనిచేస్తామని ప్రణవ్ తెలిపారు. హుజురాబాద్ మండలం, మున్సిపల్ పరిధిలో, జమ్మికుంట, మండలం, వీణవంక ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల నుండి మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల, గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో సుమారు పదివేల మంది తరలి వెళ్లారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!