Social 1080×1350 • Multi-page
04-12-2024 BREAKING NEWS 03:47 PM
swarnodayam.com
Telugu Daily News

చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..మాంటిస్సోరి అకాడమిక్ డైరెక్టర్ విష్ణుమహంతి భరత్ కుమార్

చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..మాంటిస్సోరి అకాడమిక్ డైరెక్టర్ విష్ణుమహంతి భరత్ కుమార్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
చదువుతోపాటు విద్యార్థులు క్రీడల్లోను రాణించాలని మాంటిస్సోరి అకాడమిక్ డైరెక్టర్ విష్ణుమహంతి భరత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో ఏర్పాటుచేసిన అభినందన కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నిమ్మటూరి మిథున, ఏడవ తరగతి చదువుతున్న మాటూరి అవిఘ్నలు రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో కరీంనగర్ జిల్లా జట్టులో రాణించి విజయం సాధించడం అభినందనీయమని, వీరు ఈనెల 8 నుంచి 14 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండుసర్ లో జరిగే జాతీయ స్థాయి బాలికల అండర్ 14 హాకీ క్రీడా పోటీల్లో ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారికి జ్ఞాపిక అందజేసి అభినందించారు. అలాగే ప్రతి విద్యార్థి వారిని ఆదర్శంగా తీసుకొని చదువుల్లో రాణిస్తూనే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గీతాషాజు, డైరెక్టర్స్ షాజూ థామస్, గండ్ర సుధాకర్ రెడ్డి, నూకల శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!