Social 1080×1350 • Multi-page
06-12-2024 BREAKING NEWS 04:04 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి.. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజా పతినిధులు, ప్రజాసంఘాల నాయకులు

ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి.. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజా పతినిధులు, ప్రజాసంఘాల నాయకులు
IMG_20241206_155851

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మహమ్మద్ ఖాళిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గందే రాదిక మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ తన బాల్యంలో కులవివక్షను ఎదుర్కొని తర్వాత దాని నిర్మూలనకు కృషిచేసి అణగారిన వర్గాల ప్రజలందరికీ హక్కులు, స్వేచ్ఛ , సమానత్వం, మహిళా హక్కులు మొదలైన వాటిని రాజ్యాంగంలో పొందుపరిచి పేద ప్రజలకు అండగా నిలిచారన్నారు. సమాజంలో అన్ని వర్గాల, కులాల ,మతాల ప్రజలందరికీ హక్కులు కల్పించి నవభారత నిర్మాణానికి పునాదులు వేశారన్నారు. ప్రపంచం గర్వపడేలా రాజ్యాంగాన్ని రచించి లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామ్య భావాలను పొందుపర్చారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే అంబేద్కర్ కు మనం అర్పించే నిజమైన నివాళి అవుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గూడూరు రాజేశ్వరి స్వామిరెడ్డి, హనుమాన్ దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్, జయన్న పౌండేషన్ చైర్మన్ గుడిపాటి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ డిపార్ట్మెంట్ తిప్పారపు సంపత్, జ్యోతిరావు పూలే జయంతి కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, హుజురాబాద్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, ప్రముఖ కవి, రచయిత నాగుల సత్య గౌడ్, ప్రజా సంఘాల నాయకులు చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, ఎర్ర శ్రీధర్ , మారేపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వేల్పుల ప్రభాకర్, సందేల వెంకన్న, గొట్టే జమదగ్ని, గ్రెస్ నాయకులు కాజీపేట శ్రీనివాస్, సొల్లు బాబు, చందమల్ల బాబు, సొల్లు సునీత, రావుల రాజేష్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత , తిరుమల, కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు లావణ్య, మైనార్టీ నాయకురాలు కరిమ, కొలిపాక సమ్మయ్య, ఇల్లందుల సమ్మయ్య, తునికి సమ్మయ్య, బత్తుల రాజలింగం, బొడ్డు ఐలయ్య, మైనార్టీ నాయకులు జలీల్, మారేపల్లి సంజీవరావు, ఎర్ర రాజకుమార్, దాట్ల ప్రభాకర్, ఆకునూరి అచ్యుత్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్టాండ్లో…

బాబా సాహెబ్ డా ” బి ర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా హుజూరాబాద్ బస్ స్టాండ్ లో వున్న అంబేద్కర్ చిత్ర పటానికి హుజూరాబాద్ డిపో మేనేజర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో పూల అలంకరణతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వి రత్నం, రామచంద్రం, రవీందర్, వి భాస్కర్, వి ప్రభాకర్, వసంత్, సమ్మయ్య, మల్లయ్య,
వారితో పాటు ఆర్టీసీ ఉద్యోగులు ఎస్ టిఐ సారయ్య, సూపర్వైజర్ సాయి చరణ్, ఐల్లయ్య, ఎంవీ రెడ్డి, సురేష్ పాల్గోన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో…

బీజేపీ పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వారి విగ్రహానికి పూల మాల సమర్పించి ఘననివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి దళిత మోర్చా అధ్యక్షులు బోరగాల సారయ్య, మాజీ సర్పంచ్ పోతుల సంజీవయ్య, ప్రధాన కార్యదర్శి వోడ్నాల విజయ్, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు రావుల వేణు, జిల్లా కార్యవర్గ సభ్యులు గంగిశెట్టి ప్రభాకర్, నరాల రాజశేఖర్, పట్టణ ఉపాధ్యక్షులు యాంసాని శశిధర్, యాళ్ల సంజీవ రెడ్డి,పట్టణ obc మోర్చా అద్యక్షులు గంట్ట సంపత్ బూత్ అధ్యక్షులు దేవేంద్ర, రాపాక రాజు, కుసుమ సమ్మయ్య మునిగంట్టి నాగరాజ్ శక్తి కేంద్ర ఇంఛార్జి పడారీ కొమురయ్య ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!