Social 1080×1350 • Multi-page
07-12-2024 BREAKING NEWS 06:34 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయస్థాయి హాకీ పోటీలకు తెలంగాణ కోచ్ గా యేముల రవికుమార్.

జాతీయస్థాయి హాకీ పోటీలకు తెలంగాణ కోచ్ గా యేముల రవికుమార్.
IMG-20241207-WA0055

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, డిసెంబర్7: జాతీయ స్థాయి హాకీ పోటీలకు తెలంగాణ జట్టు తరపున కోచ్ గా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన యేముల రవికుమార్ ను ఎస్ జిఎఫ్ టీఎస్ సెక్రటరీ రామ్ రెడ్డి నియమించినట్లు కరీంనగర్ జిల్లా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 9 నుండి 14 వ తేదీ వరకు మధ్యప్రదేశ్ లోని మండాసూర్ లో జరిగే జాతీయస్థాయి హాకీ అండర్ 14 గర్ల్స్ టోర్నమెంట్ కు తెలంగాణ రాష్ట్రానికి హాకీ కోచ్ గా శంకరపట్నం మండలం మెట్టిపల్లి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న యేముల రవికుమార్ ఎంపికైనట్లు ఆయన తెలిపారు. రవికుమార్ ఎంపిక పట్ల హుజురాబాద్ హాకీ క్లబ్ శాశ్వత అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ఎస్ జి ఎఫ్ జిల్లా అధ్యక్షులు సొల్లు సారయ్య, హాకీ క్లబ్ కార్యదర్శి గని శెట్టి ఉమామహేశ్వర్, కోచ్ తిరునహరి శ్రీనివాస్, క్లబ్బు ఉపాధ్యక్షులు భూసారపు శంకర్, హాకీ క్రీడాకారులు గుడ్డేలుగుల సమ్మయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరునాహరి విష్ణుకుమార్, రాజేష్, సాయి కృష్ణ, ప్రదీప్ లు హర్షం వ్యక్తం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!