Social 1080×1350 • Multi-page
08-12-2024 BREAKING NEWS 09:18 PM
swarnodayam.com
Telugu Daily News

సిరిసేడులో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!

సిరిసేడులో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం!
Oplus_131072


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్, డిసెంబర్ 08: జమ్మికుంట పరిధి ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆధ్యాంతం ఆకట్టుకుంది. SSC 2003-04 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తమకు పాఠశాల విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులతో కలిసి చిన్ననాటీ జ్ఞాపకాలు పంచుకున్నారు. బాల్య మిత్రులతో అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ స్కూల్ ఆవరణలో కలియ తిరుగుతూ ముచ్చటించారు. 20 సంవత్సరాల తర్వాత అందరూ ఒక్కచోట కలవడం పట్ల పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆనంతరం ఉపాధ్యాయులకు పూర్వ విద్యార్థులు జ్ఞాపికలు అందజేసి శాలువాలతో ఆత్మీయ సత్కారం చేశారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. పాఠశాలకు, సిరిసేడు గ్రామానికి ఉన్న తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ నేపద్యంలో 7వ తరగతి వరకు ఉన్న పాఠశాలను పదవ తరగతికి అప్-గ్రేడ్ చేయడానికి కృషిచేసిన మాజీ సర్పంచ్, తెలంగాణ సమయం తెలుగు దినపత్రిక ఎడిటర్ దిడ్డి శ్రీనివాస్ ని, ఎలబద్రి లింగయ్య తదితరులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు అప్పటి హెచ్ఎం మధుణయ్య, లక్ష్మయ్య, చంద్రహరి, మంగళంపల్లి సంపత్, వేణు, సర్వోత్తమ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్, సమ్మయ్యలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి నిర్వాహకులుగా ఎండీ నయీంపాషా, ఏలేటి సురేందర్ రెడ్డి, కలాలు వేంకటేష్, భోగం స్వర్ణలత, కొక్కుల నాగరాజు, కొక్కుల సత్య, బూర్ల రాజు, చేవుల అయిలయ్య, గణపతి రాజ్, రమేష్ తదితరుల విద్యార్థులు కృషి చేశారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!