Social 1080×1350 • Multi-page
08-12-2024 BREAKING NEWS 11:36 PM
swarnodayam.com
Telugu Daily News

కన్నుల పండువగా అయ్యప్ప స్వామి దివ్య మహా పడిపూజ

కన్నుల పండువగా అయ్యప్ప స్వామి దివ్య మహా పడిపూజ
IMG_20241208_234343

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ నాగేంద్రస్వామి దేవాలయం వద్ద పత్తెం రవీందర్ 18వ గురుస్వామి సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీ అయ్యప్పస్వామి దివ్య మహా పడిపూజ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. నాగేంద్ర స్వామి ఆలయ ప్రధాన పూజారి పందిళ్ళ భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో ఈ దివ్య మహా పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి శ్రీరామనంద భజన మండలి, నగారే కళాబృందం ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తి గీతాలతో, భక్తుల భజనలతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా, భక్తి పరవశంతో నిండిపోయింది. కన్నె స్వాములతో పేట తుళ్ళి చేయించి పడి ముట్టించినానంతరం స్వాములందరికీ అల్పాహారం అందజేశారు. ఈ పడిపూజ కార్యక్రమానికి హుజురాబాద్ మున్సిపల్ పరిధి లోని అయ్యప్ప భక్తులతో పాటు వివిధ చుట్టుపక్కల గ్రామాలు మండలాల నుండి పెద్ద ఎత్తున సుమారు 200లకు పైగా అయ్యప్ప స్వాములు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి అయ్యప్ప భక్త బృందం మోతి తిరుపతి, శ్రీపాద రమేష్, పో రెడ్డి రవీందర్ రెడ్డి, భాషబోయిన మొగిలి, శ్రీపాద సతీష్, తాడబోయిన సారయ్య, గంట శ్రీనివాస్, ఏనుగుల శ్రీనివాస్, కొండపర్తి మణిదీప్, వీణవంక పవన్ కళ్యాణ్, బత్తిని నాగరాజు తదితర స్వాములు అయ్యప్పస్వామి సేవలో పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!