Social 1080×1350 • Multi-page
09-12-2024 BREAKING NEWS 07:18 PM
swarnodayam.com
Telugu Daily News

పోలీసుల అదుపులో మాజీ సర్పంచులు.. చలో అసెంబ్లీ వెళ్లకుండా అడ్డుకున్న హుజురాబాద్ పోలీసులు.

పోలీసుల అదుపులో మాజీ సర్పంచులు.. చలో అసెంబ్లీ వెళ్లకుండా అడ్డుకున్న హుజురాబాద్ పోలీసులు.
IMG_20241209_191006

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ మండలంలోని పలువురు మాజీ సర్పంచులను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులో సోమవారం సర్పంచ్ల సమస్యలపై చలో అసెంబ్లీ ధర్నా ఉన్న నేపథ్యంలో తాజా మాజీ సర్పంచులను పోలీసులు అదుపులో తీసుకొని సొంత పూచికత్తుపై ఆ తర్వాత వదిలివేశారు. అనంతరం రంగాపూర్ మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్ మాట్లాడుతూ…. ప్రభుత్వం ప్రజా పాలన అంటూ తాజా మాజీ సర్పంచ్లను అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. తమ పెండింగు బిల్లుల సాధన కోసం హైదరాబాదులో శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న తమను తెల్లవారుజామునే తమ ఇంటి వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్బంధం పెరిగిపోయిందని అన్నారు. వస్తు అరెస్టు అయిన సర్పంచ్ లలో ఫోరం మాజీ అధ్యక్షుడు, తుమ్మనపల్లి సర్పంచ్ గూడూరు ప్రతాపరెడ్డి, చేల్పూర్ సర్పంచ్ మహేందర్ గౌడ్, ధర్మరాజుపల్లి సర్పంచ్ లక్ష్మారెడ్డి, రాంపూర్ సర్పంచ్ మనోహర్, కాట్రపల్లి సర్పంచ్ నిరోషా కిరణ్, వెంకటరావుపల్లి సర్పంచ్ తిరుమల తిరుపతి తదితరులు ఉన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!