Social 1080×1350 • Multi-page
10-12-2024 BREAKING NEWS 10:20 AM
swarnodayam.com
Telugu Daily News

మానవ వికాస వేదిక 20 వసంతాల వేడుకల కరపత్రం ఆవిష్కరణ!

మానవ వికాస వేదిక 20 వసంతాల వేడుకల కరపత్రం ఆవిష్కరణ!
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మానవ వికాస వేదిక 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 14, 15 తేదీల్లో 20 సంవత్సరాల ఉత్సాహాలు జరుగనున్నాయని బుచ్చయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. సోమవారం సాయంత్రం మానవ వికాస వేదిక 20 వసంతాల వేడుకల కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుచ్చయ్య మాట్లాడుతూ.. విజ్ఞాన హేతువాద, మానవ వాద సంఘాల భావజాలం ఉమ్మడి వేదికగా విశేష పేరు పొంది ఆశయాలు సాధనలో ముందుకు వెళుతున్న మానవ వికాస వేదిక దేశంలోనే ఒక విశిష్ట చరిత్ర సృష్టించుకుందన్నారు. 9 ఆశయాల సాధన ప్రధాన లక్ష్యంగా మానవ వికాస వేదిక సృష్టించుకుందన్నారు. అవి కుల నిర్మూలన, మతం లేనిజీవితం, మహిళా సాధికరిత, మానవీయా విలువలు, సంస్కృతి ప్రచారం, మానవ హక్కుల పరిరక్షణ, లౌకిక ప్రజాస్వామ్య, రాజనీతి పెంపుదల, శాస్త్రీయ దృక్పథం, సహకార ఆర్థిక విధానం, ప్రకృతి సమతుల్యత, సంస్థ ప్రణాళికతో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ కె.వీరమణి అధ్యక్షులు ద్రావిడ కళకం తమిళనాడు (పెరియార్ శిశువుడు )వస్తున్నారని, ప్రత్యేక అతిథి :జస్టిస్ డాక్టర్ గురుజాల రాధారాణి న్యాయమూర్తి హైకోర్టు హైదరాబాద్,
ముఖ్య అతిథులు నరేంద్రనాయక్ పీరా అధ్యక్షులు,
బొర్ర గోవర్ధన్ (బౌద్ధ రచయిత) రావడం జరుగుతుందన్నారు.
కరపత్ర ఆవిష్కరణలో రొంటాల బుచ్చయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భోగం రమేష్ జిల్లా అధ్యక్షులు కరీంనగర్, పేరుక సుందరయ్య కోశాధికారి, కొంకటి స్వామి జిల్లా ఉపాధ్యక్షులు కరీంనగర్, పొడిశెట్టి వెంకట్రాజము మాజీ ఎంపీపీ సైదాపూర్,
కల్వల మల్లయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ మాదిగ హక్కుల పోరాట సమితి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!