10-12-2024 NORMAL NEWS 05:51 PM
swarnodayam.com
Telugu Daily News
10-12-2024 05:51 PM By Mandala Yadagiri

140 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ.

140 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ.
IMG_20241210_174511

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మంగళవారం రోజున హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హుజురాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్(బాలికలు) లో చదువుతున్న 140 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్( రిటైర్డ్ టీచర్) పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బోరగాల తిరుమల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా స్థానిక టీచర్, డిటిఎఫ్ రాష్ట్ర నాయకుడు పలకల ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 13 సంవత్సరముల నుండి గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ట్రస్టు నిర్వాహకులు జగదీశ్వర్ సొంత డబ్బులతో ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు వివిధ సేవా కార్యక్రమాలు, సమాజంలోని పేదలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. రిటైర్డ్ పీజీ హెచ్ఎం వేల్పుల రత్నం మాట్లాడుతూ మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు వెలకట్టలేమని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు తిరుమల మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేసే అంత ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము, విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!