Social 1080×1350 • Multi-page
10-12-2024 BREAKING NEWS 06:31 PM
swarnodayam.com
Telugu Daily News

ఢిల్లీపై తెలంగాణ హాకీ జట్టు విజయం

ఢిల్లీపై తెలంగాణ హాకీ జట్టు విజయం
IMG_20241210_182940

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ డిసెంబర్10: ఢిల్లీపై తెలంగాణ హాకీ జట్టు విజయం సాధించింది. 68వ జాతీయస్థాయి ఎస్ జిఎఫ్ హాకీ టోర్నమెంట్ మధ్యప్రదేశ్ లోని మండోసర్ లో నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం జరిగిన మ్యాచ్లో ఢిల్లీపై తెలంగాణ హాకీ జట్టు 2-0 తో విజయం సాధించింది. ఈ విజయంలో నిమ్మటూరి మిధున, వర్షిత చెరి ఒక గోలు చేసి తెలంగాణ టీంకి విజయంలో కీలక పాత్ర పోషించినట్లు కోచ్ వేముల రవికుమార్, మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ జట్టు విజయం సాధించడంతో శాశ్వత అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, కరీంనగర్ జిల్లా హాకీ క్లబ్ ఉపాధ్యక్షులు బండ శ్రీనివాస్, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సెక్రటరీ జి ఉమామహేశ్వర్, క్లబ్ ఉపాధ్యక్షుడు భూసారపు శంకర్, సీనియర్ క్రీడాకారులు జీ సమ్మయ్య, హుజురాబాద్ హాకీ కోచ్ తిరునాహరి శ్రీనివాస్, బండ రఘు, కె బిక్షపతి, సాదుల శ్యాం కుమార్, రమేష్, తిరుపతి, రాజేష్, సాయికృష్ణ, ఎం విక్రం, శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!