10-12-2024 NORMAL NEWS 06:59 PM
swarnodayam.com
Telugu Daily News
10-12-2024 06:59 PM By Mandala Yadagiri

నైపుణ్యంతోనే గణితంలో విద్యార్థుల రాణింపు!. -హుజురాబాద్ మండల స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ

నైపుణ్యంతోనే గణితంలో విద్యార్థుల రాణింపు!. -హుజురాబాద్ మండల స్థాయి గణిత టాలెంట్ టెస్ట్ లో విద్యార్థుల ప్రతిభ
IMG_20241210_185745

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధులు హుజురాబాద్: జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి కరీంనగర్ ఆదేశముల మేరకు మరియు తెలంగాణ గణిత ఫోరం కరీంనగర్ జిల్లా విభాగం వారి సూచనల మేరకు మంగళవారం హుజూరాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలకు చెందిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులకు మండల స్థాయి గణిత ప్రతిభాపాటవ పోటీని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెల్పూర్ లో నిర్వహించడం జరిగింది. గణిత ప్రతిభ పాటవ పోటీలకు తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమాల నుండి 35 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రతిభ పాటవ పోటీల్లో జిల్లా పరిషత్ విభాగంలో ప్రథమ స్థానంలో మేరీ ఏంజెల్ ZPHS- చెల్పూర్, ద్వితీయ స్థానంలో జే పద్మిని ZPHS-చెల్పూర్ మరియు తృతీయ స్థానంలో జీ శివాని ZPHS(G)- హుజురాబాద్, రెసిడెన్షియల్ పాఠశాలల విభాగంలో ప్రథమ స్థానంలో ఏం ప్రీతి సాంఘిక సంక్షేమ పాఠశాల మరియు జూనియర్ కాలేజ్(G), ద్వితీయ స్థానంలో L.వర్షిత్ రెడ్డి తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు తృతీయ స్థానంలో ఆర్ శృతి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (G) విజేతలుగా నిలిచారు. ZPHS-CHELPUR ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు పి మమత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హుజురాబాద్ మండల విద్యాధికారి బి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు నిర్దేశించిన గణితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. పిల్లల గణిత సామర్థ్యాల పెంపొందించేందుకు కృషి చేస్తున్న గణిత ఫోరం కృషిని అభినందించారు. ZPHS-బోర్నపల్లి గణిత ఉపాధ్యాయులు, TTU కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పోలంపల్లి ఆదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గణితం అనేది అన్ని శాస్త్రాల అభివృద్ధికి దోహదపడుతుందని, విద్యార్థులు కూడా నిత్య జీవిత సమస్యలను గణిత విజ్ఞానం ఆధారంగా అధిగమించవచ్చునని తెలిపారు. తెలంగాణ గణిత ఫోరం మండల అధ్యక్షులు గణిత ఉపాధ్యాయులు ZPHS-చెల్పూర్ S రాజేందర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు ప్రాథమిక గణిత భావనలపై పట్టు సాధిస్తే భవిష్యత్తులో ఎలాంటి పోటీ పరీక్ష అయిన సులభంగా ఎదుర్కోవచ్చని అన్నారు. హుజురాబాద్ మండల విద్యాధికారి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ZPHS-బోర్నపల్లి గణిత ఉపాధ్యాయులు TTU కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బహుమతులను డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!