11-12-2024 NORMAL NEWS 06:05 PM
swarnodayam.com
Telugu Daily News
11-12-2024 06:05 PM By Mandala Yadagiri

టిటిడి బోర్డు నెంబర్ నర్సిరెడ్డిని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్

టిటిడి బోర్డు నెంబర్ నర్సిరెడ్డిని కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్
IMG-20241211-WA0086

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు (టీటీడీ బోర్డు మెంబర్ )నన్నూరి నర్సిరెడ్డిని హుజురాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హైదరాబాద్ లో కలిశారు. బుధవారం హైదరాబాద్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం టేకుల శ్రావణ్ మాట్లాడుతూ…పార్టీలకు అతీతంగా అందరితో కలిసి మెలిసి ఉండే మంచి మనసున్న వ్యక్తి నర్సిరెడ్డి అన్నను చాలా రోజుల తర్వాత కలవడం ఆనందంగా ఉందని తిరుమల శ్రీవారి ఆశీస్సులతో వారు చేపట్టిన పదవికి పూర్తి న్యాయం చేయాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పలపల్లి చంద్రశేఖర్, అల్లెపు విజయ్, ఆకునూరి అజిత్, కమటం సందీప్ తదితరులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!