Social 1080×1350 • Multi-page
11-12-2024 BREAKING NEWS 06:22 PM
swarnodayam.com
Telugu Daily News

సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపిన అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి

సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపిన అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి
IMG-20241211-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జగిత్యాల :సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని కరీంనగర్ -అదిలాబాద్ – నిజామాబాద్ -మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా తమ డిమాండ్లు పరిష్కరించాలని చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు రేవంత్‌ ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఎవరు ఆందోళన పడొద్దని ..ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టు కుంటుందని, ఉద్యోగులందరికి న్యాయం జరిగే విధంగా వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!