Social 1080×1350 • Multi-page
12-12-2024 BREAKING NEWS 07:37 PM
swarnodayam.com
Telugu Daily News

నాడు దోచుకుని నేడు సేవ అనేవారిని పట్టభద్రులు గుర్తించాలి.

నాడు దోచుకుని నేడు సేవ అనేవారిని పట్టభద్రులు గుర్తించాలి.
IMG-20241212-WA0107

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నాడు విద్య పేరుతో దోచుకొని, నేడు సేవ ముసుగులో వస్తున్న దోపిడీ దారులకు MLC ఎన్నికల్లో భంగపాటు తప్పదనీ
ముస్లిం మైనారిటీ నాయకుడు మురాద్ హుస్సేన్ అన్నారు. గురువారం హుజరాబాద్ లో ఆయన మాట్లాడుతూ…
కొంతమంది పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటి వరకు విద్యార్థులను అధిక ఫీజుల కోసం వేధించి ఇప్పుడు సేవ అంటూ ముందుకు వస్తున్నారని అన్నారు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు సేవ గుర్తుకు వచ్చినట్టు హడావుడి చేస్తూ పట్టభద్రులను బుట్టలో వేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పడానికి పట్టభద్ర ఓటర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వారి విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ కూడా ఎత్తని వారు ఎమ్మెల్సీగా ఎన్నికై నిరుద్యోగుల పట్ల ఏ రకంగా పోరాటం చేస్తారు అని ప్రశ్నించారు. అసాధ్యం కానీ హామీలు ఇచ్చి పట్టభద్రులను మభ్యపెడుతున్నారని దీనిని పట్టభద్రుల నమ్మే స్థితిలో లేరు అని అన్నారు. వారి విద్యాసంస్థల్లో విద్యార్థుల నుండి అక్రమంగా వేలాది రూపాయలు అడ్మిషన్ ఫీజులుగా వసూలు చేస్తూ, ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థిక దోపిడి చేస్తూ ఈరోజు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సేవ చేస్తున్నానని సేవ కోసం వస్తున్నాను అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మురాద్ అన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!