Social 1080×1350 • Multi-page
13-12-2024 BREAKING NEWS 06:42 AM
swarnodayam.com
Telugu Daily News

పెండింగ్ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్

పెండింగ్ ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్
IMG-20241213-WA0000

మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్12: పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలు రూ .7600 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలో గురువారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు బీసీలకు 42 శాతానికి వాటా పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. జనాభాలో సగభాగమైన బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి పోతున్నారని బీసీల హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిగ్రీ పేజీ ఇంటర్ కళాశాలలకు పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యాసంస్థలు మూతపడుతున్నాయని, యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం వాటా పెంచాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 18న హుజూరాబాద్లో ఒక రోజు నిరాహార దీక్షను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ అజాదీ యూత్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు సందేళ్ళ వెంకన్న, ఇప్పకాయల సాగర్, పెరుమండ్ల సదానందం గౌడ్, కట్ల రవి ముదిరాజ కిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!