Social 1080×1350 • Multi-page
13-12-2024 BREAKING NEWS 02:36 PM
swarnodayam.com
Telugu Daily News

డిగ్రీ బాల్య మిత్రుడికి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన స్నేహితులు..

డిగ్రీ బాల్య మిత్రుడికి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన స్నేహితులు..
IMG-20241213-WA0078

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి కిరణ్ (37) గత పది రోజుల క్రితం మరణించగా తన తోటి బాల్య మిత్రులు తనతో పాటు డిగ్రీ చదువుకున్న తోటి మిత్రులు చలించిపోయి వాట్సాప్ వేదికగా ఒకరి కొకరు చర్చించుకుని తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని జమచేసి, ఆ జమచేసిన రూ.22,500 రూపాయలను నీరటి కిరణ్ కుటుంబ సభ్యులకు అందజేసి స్నేహితుని కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు. స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకున్నందుకు గ్రామస్తులు వారి స్నేహబంధాన్ని అభినందించారు. ముందు తరాలకు మీ స్నేహబంధం ఆదర్శంగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. ఆర్థిక సహాయం అందజేసిన వారిలో ఇజ్జిగిరి శ్రీకాంత్, ఆర్ కానిస్టేబుల్, ఇజ్జిగిరి సంపత్, విజేందర్ రెడ్డి , వంగల సాగర్ రెడ్డి, చందర్ తదితర మిత్రులు ఉన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!