Social 1080×1350 • Multi-page
13-12-2024 BREAKING NEWS 02:58 PM
swarnodayam.com
Telugu Daily News

ముందస్తు మెప్మా సిబ్బంది సిఎల్ఆర్పిలు, ఆర్పీల అరెస్టు

ముందస్తు మెప్మా సిబ్బంది సిఎల్ఆర్పిలు, ఆర్పీల అరెస్టు
IMG_20241213_145652

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మెప్మాలో పనిచేస్తున్న సిఎల్ఆర్పిలు, ఆర్పీలు వారి హక్కుల కొరకు, ఉద్యోగ భద్రత కోసం, జీతాల పెంపుదల కొరకు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు శుక్రవారం హైదరాబాదులో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి వెళుతున్న హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో పనిచేస్తున్న సిఎల్ఆర్పిలు, ఆర్పీలను స్థానిక ఉన్నటువంటి కార్యకర్తలను ధర్నా కార్యక్రమానికి హైదరాబాద్ వెళ్లకుండా తెల్లవారుజామున హుజురాబాద్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. పోలీసులు తెల్లవారుజాముననే ఇంటింటికి తిరిగి సిఎల్ఆర్పిలు, ఆర్పీలను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం వరకు అదుపులో ఉంచుకొని సొంత పూజిత పై తిరిగి వదిలేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సిఎల్ ఆర్ పిలు టి.రమాదేవి, పసుల స్వరూప, బి .అనూష, ఆర్పీలు శోభ, భాగ్యలక్ష్మి, వినోద, అరుణ తదితరులు ఉన్నారు. అలాగే 8 నెలల జీతాల కోసం 16 మంది ఆర్ పి లు ధర్నాకు వెళ్లారు. వారిని సైతం హైదరాబాద్ సైదాబాద్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. మిగితా 8 మంది ఆర్పీలు 3 clrp లను హుజురాబాద్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెప్మా సిబ్బంది సమస్యలు పరిష్కరించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!