13-12-2024 NORMAL NEWS 06:26 PM
swarnodayam.com
Telugu Daily News
13-12-2024 06:26 PM By Mandala Yadagiri

మాదిగల ఐక్య సంక్షేమ సంఘం(MASS) రాష్ట్ర నేతలకు ఘన సన్మానం

మాదిగల ఐక్య సంక్షేమ సంఘం(MASS) రాష్ట్ర నేతలకు ఘన సన్మానం
IMG-20241213-WA0114

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాదిగల ఐక్య సంక్షేమ సంఘం(MASS)రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్షులు రామ్ సారయ్య మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇమ్మడి పవిత్రన్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పలువురు ఘనంగా సన్మానించారు. హుజురాబాద్ పట్టణంలో ప్రజా సంఘాల దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ హాజరై రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలను ఘనంగా సన్మానించారు. ఈ సంఘాన్ని వేదికగా చేసుకొని దళిత సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా ఏకతాటి పైన తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో సభాధ్యక్షులుగా వేల్పుల రత్నం నిర్వహించగా, బొడిగె మల్లయ్య, మట్టెడ ప్రకాష్, అంబాల రవీందర్, కట్కూరి రాజేందర్, రామ్ రాజేశ్వర్, వేల్పుల ప్రభాకర్, బత్తుల రాజలింగం, బొడ్డు ఐలయ్య, మాడుగుల ఓదెలు, మొలుగూరి కొమరయ్య, మోరే సతీష్, తిప్పారపు భువనచంద్ర, ఇమ్మడి వేణు, రొంటాల కుమారస్వామి, శనిగరం భాస్కర్, ఇమ్మడి రాజయ్య, దాట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!