Social 1080×1350 • Multi-page
13-12-2024 BREAKING NEWS 08:43 PM
swarnodayam.com
Telugu Daily News

లగిచర్ల రైతుకు బేడీలు వేసినందుకు నిరసనగా కరీంనగర్లో రేవంత్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

లగిచర్ల రైతుకు బేడీలు వేసినందుకు నిరసనగా కరీంనగర్లో రేవంత్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
IMG-20241213-WA0122

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: భూ నిర్వాసిత లగిచర్ల రైతు హీర్యా నాయక్ కు బేడీలు వేసినందుకు నిరసనగా బిజెపి నాయకులు కరీంనగర్ లో కమాన్ వద్ద బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రేవంత్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రైవేట్ ఫార్మసిటికల్ పరిశ్రమ కోసం నిరుపేద దళిత గిరిజన రైతుల భూములు సేకరించడమే కాకుండా వద్దని వేడుకున్న రైతులను అక్రమ కేసులు బనాయించి జైల్లోకి తోసి సామాన్య గిరిజన రైతు హీర్యా నాయక్ ను ఆసుపత్రికి బేడీలు వేసి తీవ్రవాది, దేశద్రోహి నక్సలైట్ మాదిరిగా తీసుకు వెళ్లడాన్ని నిరసిస్తూ బిజెపి కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం మిర్చి మార్కెట్లో మిర్చి రైతులకు బేడీలు వేసి అవమానపరిస్తే
నేడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రి అల్లుడి ఫార్మా పరిశ్రమ కోసం భూమిని కోల్పోయిన గిరిజన రైతు హిరియా నాయకులు బేడీలు వేసి తిప్పడం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరొకసారి నిరూపించుకున్నదని దుయ్యబట్టారు. మాట మాట్లాడితే తన తాతకు 3000 ఎకరాలు ముత్తాతకు 5000 ఎకరాలు ఉందని తండ్రి పోలీస్ పటేల్, తాత పోలీస్ పటేల్ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి తన అల్లుడి ఫార్మా పరిశ్రమ కోసం మాత్రం తన సొంత భూముల్లో ఏర్పాటు చేసుకోకుండా దళిత నిరుపేద గిరిజన రైతుల భూములు లాక్కోవడం ఎందుకో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు.

తక్షణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని
లగిచెర్ల రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు
నాంపల్లి శ్రీనివాస్, రెండవ టౌన్ కన్వీనర్ గుంజేటి శివకుమార్, జోనల్ కన్వీనర్లు అవుదుర్తి శ్రీనివాస్, పురం హరిశంకర్, తణుకు సాయికృష్ణా, సెంట్రల్ జోన్ కో కన్వీనర్ కలికోట మోహన్, మాచర్ల కోటేశ్, ఈస్ట్ జోన్ కో కన్వీనర్లు పోరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాసం గణేష్ ,లడ్డు ముందాడా, కొలిపాక శ్రీనివాస్, తోట సతీష్, గుర్రం సమర సింహారెడ్డి, గుండె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!