Social 1080×1350 • Multi-page
13-12-2024 BREAKING NEWS 09:41 PM
swarnodayam.com
Telugu Daily News

జమ్మికుంటలో సైకో వీరంగం…. – సైకోకు స్థానికుల దేహశుద్ధి..స్వర్ణోదయం

జమ్మికుంటలో సైకో వీరంగం…. – సైకోకు స్థానికుల దేహశుద్ధి..స్వర్ణోదయం
IMG_20241213_212841

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ లో మంచిర్యాలకు చెందిన ఒక సైకో పూర్తిగా బట్టలు లేకుండా నగ్నంగా తిరుగుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్న స్థానికులు అతనిని చితకబాదారు.. అక్కడ ఉన్న స్థానికుల వివరాల ప్రకారం..పూర్తిగా నగ్నంగా, బట్టల్లేకుండా తిరగడమే కాక, అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేస్తున్నాడని, స్థానికులు తెలిపారు. మంచిర్యాలకు చెందిన యువకుడు జమ్మికుంట బస్టాండ్ లో ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం వలన అక్కడ ఉన్న యువకులు, ప్రజలు ఎందుకు అలా చేస్తున్నావని అడిగిన తన ప్రవర్తన మారకపోగా ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడంతో చితకబాది దేహశుద్ధి చేశారు. అతని వివరాలు అతడినే అడగగా తనది మంచిర్యాల అని, తన వయస్సు 30 ఏళ్లు ఉంటాయని, జమ్మికుంటలోని ఓ కంగన్ హాల్ కు సంబంధించిన బంధువు అని తెలిసింది. కాగా తదనంతరం స్థానికులు జమ్మికుంట పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయగా, జమ్మికుంట సీఐ వరగంటి రవి సంఘటన స్థలానికి చేరుకొని ఆ సైకోను అదుపులోకి తీసుకొని అతడిని జమ్మికుంట పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాగా ఈ సంఘటన పట్టణంలో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!