14-12-2024 NORMAL NEWS 04:01 PM
swarnodayam.com
Telugu Daily News
14-12-2024 04:01 PM By Mandala Yadagiri

50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

50 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG_20241214_155944

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి శనివారం సుమారు ₹50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అందజేశారు. హుజురాబాద్ లోని తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండలానికి ₹16,21,500 విలువైన చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నించిన ప్రతిసారీ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలపై అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని హామీ ఇచ్చారు. చెక్కుల పంపిణీ వివరాలు:
• జమ్మికుంట రూరల్: ₹1,24,500
• జమ్మికుంట టౌన్: ₹9,64,500
• వీణవంక: ₹18,95,500
• ఇల్లంతకుంట: ₹77,000

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పీఎస్ఎస్ఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షుడు డాక్టర్ ఐలయ్య, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ప్రతాప తిరుమల్ రెడ్డి, గందె శ్రీనివాస్, అపరాధ ముత్యం రాజు, ఇమ్రాన్, కొండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నా వంతు సాయం ఎప్పటికీ అందిస్తాను అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!