Social 1080×1350 • Multi-page
16-12-2024 BREAKING NEWS 08:38 AM
swarnodayam.com
Telugu Daily News

బిగ్ బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్

బిగ్ బాస్ సీజన్-8 విన్నర్ నిఖిల్
IMG_20241216_083013

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: మా టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్-8 విన్నర్ గా నిఖిల్, రన్నర్ఫ్ గా గౌతమ్ నిలిచారు. దీంతో ఆదివారం రాత్రి ఆయనకు హీరో కొణిదెల రాంచరణ్ చేతుల మీదుగా విన్నర్ నిఖిల్‌కు రూ.55 లక్షల చెక్కు అందజేశారు. నూట అయిదు రోజులపాటు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ బిగ్ బాస్ టీవీ షో నిన్నటితో ఎట్టకేలకు ముగిసింది. దీంతో 300 మంది పోలీసులతో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఊరేగింపుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఎలాంటి ర్యాలీ లేకుండా సైలెంట్‌గా విన్నర్ నిఖిల్ ఇంటికి వెళ్లిపోయారు. ఎందుకంటే గత ఏడాది బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ ర్యాలీ పేరుతో గొడవలు సృష్టించడంతో పోలీసులు ఈసారి ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వకపోగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!