Social 1080×1350 • Multi-page
17-12-2024 BREAKING NEWS 01:19 PM
swarnodayam.com
Telugu Daily News

బీజేపీలోకి తిరిగి చేరిన జిల్లా మహిళా నాయకురాలు..

బీజేపీలోకి తిరిగి చేరిన జిల్లా మహిళా నాయకురాలు..
IMG-20241217-WA0032

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీజేపీ మాజీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు ఈదులకంటి రమాదేవి నేడు తిరిగి తన సొంత గూటికి చేరారు. రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు కొమరయ్య మరియు పట్టణ అధ్యక్షులు గంగిశెట్టి రాజుల సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని బీజేపీ పార్టీలో చేరటం జరిగింది. ఈ దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చేది ఒక్క మోడీనే నని అందుకే తిరిగి బిజెపిలో చేరుతున్నట్టు, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదులకంటి నరేందర్ రెడ్డి, సెక్రటరీ నరాల రాజశేఖర్, గంట సంపత్, కొలిపాక వెంకటేష్, ఆవుల సదయ్య, ఐత సందీప్, వంగ రమ-వెంకట్రమణరెడ్డి, అరుంధతి, పద్మ,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!