Social 1080×1350 • Multi-page
17-12-2024 BREAKING NEWS 07:26 PM
swarnodayam.com
Telugu Daily News

పెన్షనర్ల అనుభవాలు ఉద్యోగులకు పాఠాలు -ఆర్డీవో రమేష్ బాబు

పెన్షనర్ల అనుభవాలు ఉద్యోగులకు పాఠాలు -ఆర్డీవో రమేష్ బాబు
IMG-20241217-WA0053(1)


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పెన్షనర్ల అనుభవాలు నేటి ఉద్యోగులకు పాఠాలుగా ఉంటాయని పెన్షనర్ల సేవలు మరువలేనివని హుజురాబాద్ ఆర్డిఓ సిహెచ్ రమేష్ బాబు అన్నారు. మంగళవారం హుజురాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పెన్షనర్స్ డే సందర్భంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…వివిధ శాఖల్లో తమ పదవులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఉద్యోగులు తమ అనుభవాలను నేటి తరానికి బోధించాలన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్ల పితామహుడు డిఎస్ నకార పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్ ట్రెజరీ అధికారి పి శివరామకృష్ణ, TSGREA Huzurabad మండల శాఖ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ పాషా, కార్యదర్శి విష్ణుదాసు గోపాల్ రావు, పిల్లల లక్ష్మినారాయణ ఉపాధ్యాక్సులు, గణపతి రెడ్డి ప్రచార కార్యదర్శి, జిల్లా కార్యదర్శి కొంరవెల్లి సత్యనారాయణ, గంజి జయవర్ధన్, K శ్రీహరి, లష్మినారాయణ, కాంతమ్మ, పెన్షనర్లు. 120 మంది తదితరులు పాల్గోన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!