17-12-2024 NORMAL NEWS 07:59 PM
swarnodayam.com
Telugu Daily News
17-12-2024 07:59 PM By Mandala Yadagiri

హుజురాబాద్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్టమస్ వేడుకలు

హుజురాబాద్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్టమస్ వేడుకలు
IMG_20241217_195608

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సిటీ సెంటర్లో పాస్టర్స్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పాస్టర్ డేవిడ్ రాజు కార్యదర్శి పాస్టర్ సారంగపాణి ట్రెజరర్ పాస్టర్ జోసఫ్ తో హుజురాబాద్ పాస్టర్ తో పాటు మండలంలో ఉన్న పాస్టర్స్ అందరు కలిసి గ్రాండ్ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఆదివారం రాత్రి జరుపుకున్నారు. ఈ వేడుకలకు జాతీయ, అంతర్జాతీయ వాడబడుతున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ జడ్సన్ అబ్రహం హాజరై ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఆయనతోపాటు హుజూరాబాద్ కౌన్సిలర్లు మారేపల్లి సుశీల, ములుగు సృజన- పూర్ణచందర్ మరియు పాస్టర్స్ హాజరయ్యారు. క్రైస్తవులతో కలిసి పాస్టర్స్ రాత్రి 12 గంటల వరకు ఈ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలను చూడడానికి క్రైస్తవులతో పాటు కులమత బేధం లేకుండా అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మండల పాస్టర్స్ కమిటీ వారు ప్రతి సంవత్సరం వారి సేవలను బట్టి ఒక సీనియర్ పాస్టర్ దంపతులకు బట్టలు పెట్టి సన్మానం చేస్తారన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం రంగాపూర్ కల్వరి టెంపుల్ లో సేవ చేస్తున్న రెవరెండ్ డాక్టర్ పి.ఆర్ నెల్సన్ – సుధీన దంపతులను నియోజకవర్గ, మండల పాస్టర్లందరూ ఘనంగా సన్మానం చేశారు. ప్రత్యేక అతిథులు జడ్సన్ అబ్రహాము మరియు కౌన్సిలర్లు, పాస్టర్లు అందరూ కలిసి కేక్ కట్ చేసి అక్కడికి వచ్చిన అందరికీ పంచిపెట్టారు. అక్కడికి హాజరైన దాదాపు 700 మందికి కౌన్సిలర్ పూర్ణచందర్ సహకారంతో ప్రేమ విందును ఏర్పాటు చేశారు. పిల్లలు యూత్ సభ్యులు సంఘ సభ్యులు వృద్ధులు ఆటపాటలతో వృత్యాలతో యేసు పుట్టిన సంబరాలను ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు హుజురాబాద్ నియోజకవర్గం అధ్యక్షులు డేనియల్ సెక్రటరీ టీ, ఎలీషా ట్రెజరర్ వి ప్రసాద్, పాస్టర్లు ఏసుదాసు ప్రేమ్ కుమార్, నెల్సన్, కిరణ్, ఆంధ్రయ్య, సామ్యూల్, సామ్సన్, ఆజర్య, కిరణ్, ఆనంద్, మార్కు, పౌలయ్య తదితరులు హాజరయ్యారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!