Social 1080×1350 • Multi-page
18-12-2024 BREAKING NEWS 06:52 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి.. -తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కి వినతి పత్రం అందజేసిన ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్

ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలి.. -తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కి వినతి పత్రం అందజేసిన ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణపై బుధవారం ఏకసభ్య కమిషన్ చైర్మన్ మాజీ జడ్జి షామీమ్ అక్తర్ కి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. .అనంతరం ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో 59 షెడ్యూల్ కులాలను వారి వారి సంఖ్యను బట్టి రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగిందని కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందిన కులాలను షెడ్యూల్ కులం నుండి తొలగించాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాశారన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకై ఏకసభ్య కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి షమీమ్ అక్తర్ కి ఒక నివేదిక సమర్పించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ కులంలో 59 కులాలకు సంబంధించిన ప్రతి చిన్న కులానికి న్యాయం జరగాలని ఎవరి వాట వారికి దక్కాలని అందుకే ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గా కోరడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రత్నం, మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ సారయ్య, సీనియర్ దళిత నాయకులు మొలుగూరి కొమరయ్య, ద్రవిడ మహాసభ కన్వీనర్ రామ్ రాజేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మడి రాజయ్య, రొంటల కుమారస్వామి, శనిగరం భాస్కర్, ఇమ్మడి కిరణ్ పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!