Social 1080×1350 • Multi-page
19-12-2024 BREAKING NEWS 07:06 PM
swarnodayam.com
Telugu Daily News

కేంద్ర హోంమంత్రి అమిత్తాను వెంటనే బర్తరఫ్ చేయాలి- ప్రజా సంఘాల నాయకులు

కేంద్ర హోంమంత్రి అమిత్తాను వెంటనే బర్తరఫ్ చేయాలి- ప్రజా సంఘాల నాయకులు
IMG_20241219_190502

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, డిసెంబర్ 19: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఉద్దేశపూర్వకంగా దూషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రజా సంఘాల నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు నాయకులు పలువురు మాట్లాడుతూ.. అమిత్ షా ను బీజేపీ నుంచి బేషరతుగా తొలగించాలని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు ఎర్ర రవీందర్, సాల్లు బాబు, లంకదాసరి లావణ్య, కొలిపాక శంకర్, మిడిదొడ్డి రాజు, ఎర్ర రమేష్, కడారి తిరుమల, సాల్లు సునీత, వేల్పుల ప్రభాకర్, మోరె సతీష్, ఇల్లందుల సమ్మయ్య, సంధ్యల వెంకటేశ్వరు, దాట్ల ప్రభాకర్, తిప్పారపు భువనచందర్, రేణికుంట్ల సందీప్, చిట్యాల రేవంత్, యండి అప్సర్, యండి సాదిక్, బోరగాల రాజయ్య, వేల్పుల రత్నం, లంకదాసరి ప్రవీణ్, బీమోజు సదానందం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!